
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ ముందు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ED ఆఫీస్ కు వెళ్లారు వాద్రా. ఆయనతో పాటు ప్రియాంకా గాంధీ కూడా ED ఆఫీస్ కు వచ్చారు. లండన్ లో స్థిరాస్తుల కేసులో లావాదేవీలు, కొనుగోళ్లకు సంబంధించి రాబర్ట్ వాద్రాను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో రాబర్ట్ వాద్రాకు ఈ నెల 16వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు. 6న ED ముందు హాజరుకావాలని సూచించింది. కోర్టు సూచన ప్రకారం ED ఆఫీస్ కు వెళ్లారు వాద్రా.