రాహుల్ సపోర్టర్ ను తన కారులో తీసుకెళ్లిన ప్రియాంక గాంధీ

రాహుల్ సపోర్టర్ ను తన కారులో తీసుకెళ్లిన ప్రియాంక గాంధీ

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ అధికారులు నాలుగోసారి విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు రాహుల్ తోపాటు ప్రియాంక గాంధీ కూడా వెళ్లారు. రాహుల్ ఈడీ ఆఫీసులోకి వెళ్లిన తర్వాత ప్రియాంక జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి బయలుదేరారు. అయితే అక్కడికి వెళ్తుండగా రాహుల్ గాంధీ సపోర్టర్ ను పోలీసులు తీసుకెళ్తుండడాన్ని చూసిన ఆమె తన కారును ఆపింది. అతడిని తన కారులో ఎక్కించుకుని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమానికి వెళ్లారు. 

కాగా ఇప్పటికే రాహుల్ గాంధీని 30గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఇక ఇవాళ నాలుగోసారి రాహుల్ ను ప్రశ్నిస్తున్నారు అధికారులు. రాహుల్ విజ్ఞప్తితో 17 నుండి 19 వరకు ఈడీ అధికారులు విచారణ చేపట్టలేదు. మరోవైపు  రాహుల్ గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేతలు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.