మీరు అమ్ముతున్న కేంద్ర సంస్థలన్నీ నెహ్రూ తెచ్చినవే: మోదీ సర్కార్ కు ప్రియాంక స్ట్రాంగ్ కౌంటర్

మీరు అమ్ముతున్న కేంద్ర సంస్థలన్నీ నెహ్రూ తెచ్చినవే: మోదీ సర్కార్ కు ప్రియాంక స్ట్రాంగ్ కౌంటర్

వందేమాతరంపై లోక్ సభలో వాడీవేడిగా చర్చ సాగింది. అధికార పక్షం వక్రభాషణలు, ప్రతిపక్షాల కౌంటర్లతో  సభ దద్దరిల్లింది. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని  వందేమాతర గీతంతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహనీయులను గౌరవింంచుకోవాల్సి టైంలో..చట్ట సభలో వారిని అధికార పక్షం కించపర్చడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది. వందేమాతరం గీతాన్ని వక్రీకరంచడంపై కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ మోదీ సర్కర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక స్పీచ్ కి సభ చప్పట్లతో మార్మోగింది. ఒకానొక దశలో అధికార పక్షం సభ్యులు కూడా చప్పట్లు కొడతారా అనే విధంగా ఆమె స్పీచ్ సాగింది. 

వందేమాతర ఉద్యమంతో బ్రిటీస్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్ర్యం  తెచ్చిన మహనీయులను సర్మించుకోకుండా వారిని నిండు సభలో అవమానించే విధంగా అధికార పక్షం నేతలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు ప్రియాంకాగాంధీ. విరోధులు కూడా అటువంటి మహానుభావులను గౌరవిస్తారు.. కానీ అధికార నేతలకు ఇంత అహంకారం ఎందుకు అని మండిపడ్డారు ప్రియాంక గాంధీ. 

వందేమాతరం గీతం దేశ విభజనను ప్రోత్సహించేది ఉందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి సమర యోధులను అవమానించారని ప్రియాంక అన్నారు. స్వాతంత్రంకోసం కొట్లాడిన యోధులను దోషులను చేసే ప్రయత్నం  మోదీ చేశారని విమర్శించారు. 

►ALSO READ | బెంగాల్ లో ఎలక్షన్లకోసమే ..వందేమాతరం లొల్లి:ప్రియాంకగాంధీ

దేశ స్వాతంత్ర్యం కోసం జవహర్ లాల్ నెహ్రూ పదకొండేళ్లు  జైల్లో ఉన్నారు. స్వాతంత్ర్యం సిద్దించిన నాటి నుంచి దేశ ప్రధానిగా 16ఏళ్లు ప్రజలకోసం ఎన్నో సంస్కరణలు తెచ్చారు.. నెహ్రూ అద్భుతమైన సంస్కరణలే లేకుండా నేడు దేశం ఈ విధంగా ఉండేదా అని ప్రశ్నించారు ప్రియాంకగాంధీ. 

పదకొండేళ్లుగా మీరు అమ్ముతూ వస్తున్న  కేంద్ర సంస్థలన్నీ ప్రజలకోసం నెహ్రూ తెచ్చినవే అని మోదీ సర్కార్ కు  గట్టి కౌంటరిచ్చారు ప్రియాంకగాందీ. నెహ్రూ ఇస్రో స్థాపించకపోతే ఇవాళ మంగళ్ యాన్ సాధ్యమయ్యేదా?  డీఆర్ డీవో  ఏర్పాటు చేయకపోతే తేజస్ తయారు చేసేవారా?. ఐఐటీ, ఐఐఎం లు  తీసుకురాకపోతే అత్యాధునిక టెక్నాలజీ మనకు అందేదా?  అని ప్రశ్నించారు.ఎయిమ్స్ లాంటి ఆరోగ్య సంస్థల తీసుకురాకపోతే కరోనా లాంటి మహమ్మారిలకు మందులు కనిపెట్టేవారేనా అని అన్నారు. ఇప్పుడు మీరు చెప్పుకుంటున్న పెద్ద నిర్ణయాలు ఎలా చేసేవారని మోదీ సర్కార్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు ప్రియాంకాగాంధీ.