ఆ దుర్మార్గులు వీళ్లే: ప్లీజ్ సమస్య వస్తే 100కి ఫోన్ చేయండి

ఆ దుర్మార్గులు వీళ్లే: ప్లీజ్ సమస్య వస్తే 100కి ఫోన్ చేయండి
  • ప్రియాంక కేసు వివరాల్ని వెల్లడించిన సీపీ సజ్జనార్
  • సమస్య వస్తే పోలీసుల్ని మర్చిపోవద్దని విజ్ఞప్తి

పక్కా స్కెచ్ ప్రకారం కుట్ర చేసి నలుగురు దుర్మార్గులు కలిసి.. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య చేసినట్లు కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ తెలిపారు. ఈ కేసు వివరాలను శుక్రవారం రాత్రి ఆయన మీడియాకు వివరించారు. నలుగురు నిందితులు నారాయణ్ పేట్ జిల్లా మక్తల్ మండలానికి చెందిన వారని చెప్పారు. ఏ1 మహ్మద్ అలియాస్ ఆరిఫ్ (26) లారీ డ్రైవర్, ఏ2 జొల్లు శివ (20) లారీ క్లీనర్, ఏ3 జొల్లు నవీన్ (20) లారీ క్లీనర్, ఏ4  చెన్నకేశవులు (20) లారీ డ్రైవర్ అని తెలిపారు.

పాయంత్రమే స్కెచ్ వేశారు..

లారీ అన్‌లోడింగ్ కోసం వచ్చిన మహ్మద్, శివ, నవీన్, చెన్నకేశవులు.. లోడ్ తీసుకోవాల్సిన వ్యక్తి ఫోన్ ఎత్తకపోవడంతో తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర లారీ పార్కింగ్ చేశారు. బుధవారం సాయంత్రం 5.30 సమయంలో ప్రియాంక రెడ్డి టోల్ ప్లాజా దగ్గర తన స్కూటీ పెట్టి  మాదాపూర్ వెళ్లింది. ఆ సమయంలో స్కూటీ అక్కడపెట్టడాన్ని నిందితులు గమనించారు. అప్పటికే మందు కొడుతున్న వీళ్లు ఆమెపై అఘాయిత్యానికి ప్లాన్ స్టార్ట్ చేశారు. ఎలా దాడి చేయాలి? ఏంటన్నదానిపై మాట్లాడుకుంటూ మందు తాగారు. ఆమె మళ్లీ బండి కోసం ఏదో ఒక టైంలో వస్తుంది. బండిలో గాలితీసేసి పెట్టి.. హెల్స్ చేసినట్లుగా నటించి, ఆమెపై అకృత్యానికి పాల్పడొచ్చని ఏ2 శివ చెప్పాడు. ఆమె రాత్రి 9.30 సమయంలో స్కూటీ కోసం వచ్చినప్పుడు ఏ1 మహ్మద్ వెళ్లి టైర్ పంక్చర్ అయిందని, బాగు చేయించి తెస్తానని తీసుకున్నాడు.

MORE NEWS:

షీ టీమ్ నంబర్ ఇదే.. మన బిడ్డలకు చెప్పండి

పోలీసుల సూచన: ప్రతి యువతి బ్యాగ్ లో పెప్పర్ స్ప్రే

నోరు నొక్కి అఘాయిత్యం.. ఊపిరాడక మృతి

అమాయకంగా నమ్మేసిన ప్రియాంక వాళ్ల చేతికి స్కూటీ అప్పగించింది. శివ దాన్ని తీసుకుని పంక్చర్ వేయించుకుని రావడానికి వెళ్లి గాలి మాత్రమే కొట్టించుకుని వచ్చాడు. ఆలోపు మిగిలిన ముగ్గరు ప్రియాంకను పక్కకు లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఆమె అరవకుండా మహ్మద్ గట్టిగా ముక్కు, నోరు నొక్కి పెట్టాడు. అంతలో వచ్చిన శివ కూడా ప్రియాంకపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 10.08 గంటల సమయంలో ప్రియాంక చనిపోయింది. వాళ్లు నోరు నొక్కిపెట్టడం వల్ల ఊపిరాడక ఆమె మరణించింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని లారీలో తీసుకుని వెళ్లి చాలా సేపు హైవేపై తిరిగారు. ఇద్దరు లారీలో ఇద్దరు స్కూటీపై వెళ్లారు. బాటిల్‌లో పెట్రోల్ పట్టించుకుని చటాన్‌పల్లి సమీపంలో తగలబెట్టారు.

ప్లీజ్.. ప్లీజ్ అంటూ చెప్పిన సీపీ

ఈ ప్రెస్ మీట్ సందర్భంగా సీపీ సజ్జనార్ పదే పదే డయల్ 100 గురించి ప్రస్తావించారు. ఏ సమస్య వచ్చినా వెంటనే ఫోన్ చేయాలని కోరారు. ఫోన్ చేసిన మూడు నుంచి ఐదు నిమిషాల గ్యాప్‌లో పోలీసులు వచ్చి సాయం చేస్తారని చెప్పారాయన. మహిళలు, వృద్ధులు, పిల్లలు.. ఇలా ఎవరైనా సరే ఏదైనా అనుమానాస్పదంగా, ఇబ్బంది జరిగాలే అనిపించినా వెంటనే 100 లేదా సైబరాబాద్ కమిషనరేట్ నంబర్ 9490617111 కు ఫోన్ చేయాలని కోరారు. రాత్రి వేళ పెట్రోల్ అయిపోయినా, ఇంకేదైనా సమస్య వచ్చినా వెంటనే ఫోన్ చేయాలని… ప్లీజ్… ప్లీజ్ అంటూ చెప్పారు సీపీ సజ్జనార్. కష్టం వస్తే పోలీసులు ప్రజల కోసమే ఉన్నారన్న విషయం మర్చిపోవద్దంటూ విజ్ఞప్తి చేశారాయన.