ప్రొ కబడ్డీ సీజన్‌-12 విన్నర్ దబాంగ్ ఢిల్లీ

ప్రొ కబడ్డీ సీజన్‌-12 విన్నర్ దబాంగ్ ఢిల్లీ

న్యూఢిల్లీ: సొంతగడ్డపై ఆఖరాటలో అదరగొట్టిన దబాంగ్ ఢిల్లీ కేసీ ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌‌లో చాంపియన్‌‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ 31-–28 తేడాతో టేబుల్ టాపర్ పుణెరి పల్టాన్‌‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి మెగా లీగ్‌‌లో రెండోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఎనిమిదో సీజన్‌‌లో తొలి టైటిల్ నెగ్గిన ఢిల్లీకి నాడు కెప్టెన్‌‌గా వ్యవహరించిన జోగిందర్ నర్వాల్ ఇప్పుడు హెడ్‌‌ కోచ్‌‌గా ఉన్నాడు.

ఉత్కంఠగా సాగిన తుదిపోరులో రైడర్లు నీరజ్ నర్వాల్ (9 పాయింట్లు) అజింక్య పవార్ (6) సత్తా చాటారు.  ఆదిత్య షిండే (10)  పోరాడినా డిఫెండింగ్ చాంప్ పుణెరికి ఓటమి తప్పలేదు. అయాన్ (పట్నా)  ఈ సీజన్ బెస్ట్ రైడర్‌‌‌‌ అవార్డు అందుకోగా.. నవదీప్ (పట్నా) బెస్ట్ డిఫెండర్‌‌‌‌గా  నిలిచాడు.