పీఎంశ్రీ స్కూళ్లకు ఫేజ్2​ దరఖాస్తులు 31 వరకు

పీఎంశ్రీ స్కూళ్లకు ఫేజ్2​ దరఖాస్తులు 31 వరకు
  • ఫస్ట్ ఫేజ్​లో 543 స్కూళ్లను ఎంపిక చేసిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు :  సర్కారు స్కూళ్ల లో వసతుల కల్పన కోసం కేంద్రం తీసుకొచ్చిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) ఫేజ్ 2 అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల11న  ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ 31 వరకూ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో 4,930 స్కూళ్లకు ఈ స్కీమ్​కు ఎలిజిబిలిటీ ఉన్నట్లు గుర్తిం చామన్నారు. 

వీటిలో ఇప్పటిదాకా 2వేల స్కూళ్లు దరఖాస్తు చేసుకోగా..  ఫస్ట్ ఫేజ్​లో 543 స్కూల్స్ ఎంపికయ్యాయి. ఈ స్కూళ్లను గ్రీన్ స్కూళ్లుగా మార్చేందుకు అవసరమైన వసతుల కోసం కేంద్రం ఐదేండ్ల పాటు విడతల వారీగా నిధులు ఇస్తుంది. ఆ నిధులతో సోలార్ ప్యానెళ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్లాస్టిక్ రహిత వస్తువులు, బడుల్లో పోషకాహార తోటల పెంపకం, నీటి సంరక్షణ తదితర వాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది.