
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda),సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star).టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పేట్ల(Parasuram petla) తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించారు.ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లో రిలీజయింది.
అయితే,ఈ మూవీకి వస్తోన్న భిన్నమైన రివ్యూలపై నిర్మాత దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా ఫ్యామిలీ స్టార్ సినిమా మేము టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది, ఫ్యామిలీ ఆడియెన్స్ క్రౌడ్స్గా థియేటర్స్ కి వెళ్తున్నారు.
అయితే, మీడియా నుంచి వచ్చిన రివ్యూస్ ఒకలా ఉన్నాయి, సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ వేరుగా ఉంది. వాళ్లలో 90 పర్సెంట్ మందికి ఫ్యామిలీ స్టార్ బాగా నచ్చింది. కానీ, సోషల్ మీడియాలో మరోలా ట్రోల్ చేస్తున్నారంటూ వాపోయారు. సినిమాపై వస్తోన్న నెగెటివ్ ప్రచారం సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిదికాదన్నారు.
ఒక సినిమా రిలీజైన తర్వాత మొదటి మూడు రోజుల వరకు రివ్యూలను నిలిపివేయాలని కేరళ కోర్టు తీర్పును ఇచ్చినట్లు విన్నాను. అలాంటిది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తే తప్ప నిర్మాతలకు సినిమాలు చేయడం చాలా కష్టం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన మంచి రెస్పాన్స్ వస్తోంది.నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్న కొంతమంది మాత్రం మా సినిమాపై విషం చిమ్ముతున్నారు.మా సినిమా మీకు నచ్చకపోతే ఫర్వాలేదు, మీ అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నాను కానీ మీ అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దకండి అని దిల్‌రాజు అన్నారు.
#TheFamilyStar is getting super positive reviews from the family audience and the core point is being appreciated all over ❤️?
— Sri Venkateswara Creations (@SVC_official) April 6, 2024
Book your tickets for the perfect ?????? ?????? ??????????? now!
?️ https://t.co/lBtal2ved3@TheDeverakonda @Mrunal0801… pic.twitter.com/OWJoePIcnA
ఇదిలా ఉండగా..నగరంలోని ఓ సినిమా థియేటర్ వద్ద ఆయన సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి అభిప్రాయం సేకరించారు. సినిమా బాగుందని పలువురు దిల్ రాజుకు తెలిపారు.దీంతో నెగెటివ్ టాక్‌పై దిల్ రాజు తప్పుపట్టారు.