వ్యవసాయరంగంలో సమస్యల పరిష్కారం దిశగా రీసెర్చ్ లు జరగాలి:ప్రొ. రవీందర్ యాదవ్

వ్యవసాయరంగంలో సమస్యల పరిష్కారం దిశగా రీసెర్చ్ లు జరగాలి:ప్రొ. రవీందర్ యాదవ్

ఓయూ, వెలుగు: వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూనే సమస్యల పరిష్కారం దిశగా రీసెర్చ్ లు జరగాలని ఉస్మానియా వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ స్టూడెంట్లకు సూచించారు.  ‘భారత వ్యవసాయరంగ అవలోకనం, అవకాశాలు’ అనే అంశంపై ప్రొఫెసర్ ప్రకాశ్ ఎస్. కాంబ్లే తో ఓయూ ఎకానమిక్స్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నేషనల్ సెమినార్ కు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. స్టూడెంట్లు తాము ఎంచుకున్న అంశాలపై మొక్కుబడిగా కాకుండా.. విషయం ఉండేలా రీసెర్చ్ లు చేయాలన్నారు.

స్టూడెంట్లు వారు సబ్మిట్ చేసే రీసెర్చ్ పేపర్లపై కనీసం 20 నిమిషాలకు తగ్గకుండా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె. నరేందర్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ సి. గణేశ్, ఐసీఎస్ఎస్ఆర్ మాజీ డైరెక్టర్ ఉషాకిరణ్, ఎకానమిక్స్ డిపార్ట్ మెంట్ హెచ్ వోడీ నారాయణ, రీసెర్చ్ స్కాలర్లు పాల్గొన్నారు.