అగ్రికల్చర్ వర్సిటీ నివేదిక అద్భుతం..రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

అగ్రికల్చర్ వర్సిటీ నివేదిక అద్భుతం..రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

గండిపేట, వెలుగు: ప్రొఫెసర్​ జయశంకర్​ తెలంగాణ అగ్రికల్చర్​ యూనివర్సిటీ(పీజేటీఏయూ) అద్భుత ప్రగతి సాధిస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. సోమవారం ఆయనను  లోక్​భవన్​లో పీజేటీఏయూ వీసీ జానయ్య కలిసి వర్సిటీ ప్రగతి నివేదిక అందించారు. దానిని ఆవిష్కరించిన అనంతరం గవర్నర్​ మాట్లాడారు. 

వ్యవసాయ కూలీల పిల్లలకు 15 శాతం సీట్లు కేటాయించం గొప్ప విషయమన్నారు. ఎన్‌‌ఐఆర్‌‌ఎఫ్‌‌ ర్యాంకుల్లో వర్సిటీ 37వ ర్యాంకు నుండి 24వ స్థానానికి ఎగబాకడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మంచి పనితీరు కనబరచాలని ఆకాంక్షించారు. 

ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న మూడు బ్యాచ్ లకు కలిపి ఒకే స్నాతకోత్సవాన్ని ఫిబ్రవరి 2026లో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్​ను జానయ్య విజ్ఞప్తి చేశారు. త్వరలోనే స్నాతకోత్సవం తేదీలను ఖరారు చేస్తామని గవర్నర్​ హామీ ఇచ్చారు.