హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ.డైసీ రచించిన అప్లైడ్ ఎకనామిక్స్–ప్రిన్సిపుల్స్ అండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అనే పుస్తకాన్ని గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఆవిష్కరించారు.
అంతకుముందు ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్, ఫూలే- అంబేద్కర్ ఇన్‌క్లూజివ్ అండ్ ఎంపవర్‌మెంట్ స్టడీస్ సెంటర్లు, సెల్స్ ఆధ్వర్యంలో అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్‌పై స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్‌టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్‌రావు, నల్సార్ ప్రొఫెసర్ హెచ్.వాఘేశన్ పాల్గొని ప్రసంగించారు.
