యువత తలుచుకుంటే దేశ గతిని మార్చొచ్చు: ప్రొఫెసర్ కంచె ఐలయ్య

యువత తలుచుకుంటే దేశ గతిని మార్చొచ్చు: ప్రొఫెసర్ కంచె ఐలయ్య

దేశ భవిష్యత్తులో యువత పాత్ర అత్యంత కీలకమని  ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. యువత తలుచుకుంటే దేశ గతిని మార్చగలదన్నారు
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో పలు ప్రజా సంఘాలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత పెంచాలని, ఓటర్ల హక్కులను పరిరక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ,  తమకు అనుకూలంగా లేని ఓట్లను తొలగిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని యువత ఎండగట్టాలన్నారు. ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని, అర్హులైన ఓట్ల తొలగింపును అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత మరింత పెంచడంతో పాటు, ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలపై ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని కోరారు.

SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.