- ప్రొఫెసర్ కోదండరాం
ఓయూ, వెలుగు: కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం స్టేట్ కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నివేదన సభ నిర్వహించారు.
సభకు కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు డాక్టర్ ఉపేందర్, డాక్టర్ రేష్మారెడ్డి, డాక్టర్ సీహెచ్ వెంకటేశ్, డాక్టర్ తాళ్లపల్లి వెంకటేశ్, డాక్టర్ వేల్పుల కుమార్ పాల్గొన్నారు.
