హైదరాబాద్, వెలుగు: విత్తన ధ్రువీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం అందుతుందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఇందుకోసం సంస్థకు డిపార్ట్మెంటల్ హోదా కల్పించి, ట్రెజరీ నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని కోరారుశనివారం హైదరాబాద్లోని సీడ్ సర్టిఫికేషన్ సంస్థ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘విత్తన ధ్రువీకరణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం’ లో ఆయన మాట్లాడారు. తెలిపారు. డిపార్ట్మెంటల్ హోదా కల్పిస్తే సంస్థ ఆర్థిక సమస్యల నుంచి బయటపడి, రైతులకు సర్టిఫైడ్ విత్తనాలు అందించగలదని అన్నారు.
