టీజేఎస్ కార్యకర్తలు ప్రజల్లో ఉండాలి : ప్రొఫెసర్ కోదండరాం

టీజేఎస్ కార్యకర్తలు ప్రజల్లో ఉండాలి : ప్రొఫెసర్ కోదండరాం
  • పార్టీ చీఫ్​ ప్రొఫెసర్ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ జన సమితి కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్‌‌లో నియోజకవర్గ కన్వీనర్ మెరుగు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ‘బస్తీ బాట’ పట్టాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య, గుండెల్లి రవీందర్ యాదవ్, రామచందర్, జశ్వంత్, పుష్పలత, అబ్రార్  పాల్గొన్నారు.