GHMC: పదోన్నతి పొందిన ఏఎంసీలకు పోస్టింగ్

GHMC:  పదోన్నతి పొందిన  ఏఎంసీలకు పోస్టింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియాలో సూపరింటెండెంట్లుగా పనిచేస్తూ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు(ఏఎంసీగా) ప్రమోషన్స్ పొందిన 19 మందికి పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు కమిషనర్ ఆర్వీ  కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు  జారీ చేశారు. జీహెచ్ఎంసీ సెక్షన్లు, సర్కిల్ విభాగాల్లో వీరికి బాధ్యతలను అప్పగించారు. వెంటనే కేటాయించిన పోస్టుల్లో చేరాలని ఉత్తర్వుల్లో  పేర్కొన్నారు.