హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 10 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు లభించా యి. మల్టీజోన్1 పరిధిలోని పండిట్, పీఈటీలతో పాటు ఎస్జీటీలకూ పదోన్నతులు కల్పించారు. వీరందరికి సోమవారం అర్ధరాత్రి ప్రమోషన్‌తో పాటు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంట్లో పండిట్, పీఈటీలు సుమారు 5,800 మంది ఉండగా, మిగిలిన వారంతా ఎస్జీటీలే. అయితే, ప్రస్తుతం పండిట్లకు స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, హిందీ, ఉర్దూ) హోదా లభించనున్నది. మరోపక్క ఎస్జీటీలు.. సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందారు.
