సైబరాబాద్ కమిషనరేట్​లో ప్రొటెక్షన్ గ్రూప్

సైబరాబాద్ కమిషనరేట్​లో ప్రొటెక్షన్ గ్రూప్
  • సీపీజీ సేవలను ప్రారంభించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్​ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ రక్షణకు, టెర్రరిస్టు దాడులను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సైబరాబాద్ ప్రొటెక్షన్ గ్రూప్(సీపీజీ) సేవలను శనివారం సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సీపీజీ గ్రూప్​కు గచ్చిబౌలిలోని కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్​లో స్పెషల్ ఎక్విప్​మెంట్ అందజేశారు. సీపీ మాట్లాడుతూ.. సీపీజీలు లా అండ్ ఆర్డర్ సమస్యలు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు పోలీసు, క్రైమ్స్ సిబ్బందితో కలిసి పనిచేస్తారన్నారు. వీరికి 2 నెలల పాటు ట్యాక్టికల్, డీఆర్ఎఫ్​, డిఫెన్సివ్ టెక్నిక్​పై, టెర్రరిస్టు దాడులను అడ్డుకుని జనాల ప్రాణాలను కాపాడే విధంగా ట్రైనింగ్ ఇచ్చామన్నారు.

థియేటర్ల లైసెన్స్ రెన్యూవల్ తప్పనిసరి

రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన సినిమా థియేటర్ల ఓనర్లు,అధికారులతో సీపీ రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.  థియేటర్ల లైసెన్స్​లను రెన్యూవల్ చేయించుకోవాలని.. సరైన సేఫ్టీ మెజర్ మెంట్స్ పాటించాలని ఓనర్లకు సూచించారు. లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.