అయ్యప్ప మాల వేసుకున్నారని స్కూళ్లోకి రానివ్వలే .. మొయినాబాద్​లోని పల్లవి స్కూల్‌‌‌‌లో ఘటన

అయ్యప్ప మాల వేసుకున్నారని స్కూళ్లోకి రానివ్వలే .. మొయినాబాద్​లోని పల్లవి స్కూల్‌‌‌‌లో ఘటన
  • ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, హిందూ సంఘాలు 

చేవెళ్ల, వెలుగు : అయ్యప్ప మాల ధరించారనే కారణంతో చిన్నారులను స్కూల్ ​యాజమాన్యం క్లాసుల్లోకి అనుమతించ లేదు. ముగ్గురు స్టూడెంట్లను 3 గంటలకు పైగా స్కూల్ ఆవరణలో నిల్చోబెట్టింది. స్టూడెంట్ల తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌‌‌‌ని సంప్రదించగా అనుమతించమని తేల్చి చెప్పారు. దీంతో  స్కూల్ మేనేజ్ మెంట్ తీరును వ్యతిరేకిస్తూ  తల్లిదండ్రులు, హిందూ సంఘాలు మంగళవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ సర్కిల్‌‌‌‌లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌‌‌‌ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి.

చివరకు దిగొచ్చిన మేనేజ్ మెంట్​ , ప్రిన్సిపల్ స్టూడెంట్లను క్లాసులకు అనుమతించడంతో పాటు క్షమాపణ చెప్పారు.  దీంతో తల్లిదండ్రులు, హిందూ సంఘాలు ఆందోళన విరమించాయి.  స్కూల్ వద్దకు వెళ్లిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.