వెంకటేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళన

వెంకటేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళన
  • పంచాయతీ కార్యదర్శులు, ఆదివాసీ సంఘాల డిమాండ్

బయ్యారం : సర్పంచ్, ఉపసర్పంచ్ వేధింపులతో సూసైడ్ చేసుకున్న వెంకటేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పంచాయతీ కార్యదర్శులు, ఆదివాసీ సంఘాలు అందోళనకు దిగాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం పాత ఇర్సలాపురానికి చెందిన పంచాయతీ సెక్రెటరీ వెంకటేశ్ 2 రోజుల క్రితం సూసైడ్ చేసుకున్నాడు. అతని కుటుంబానికి న్యాయం చేసేవరకు అంత్యక్రియలు జరుగనివ్వమంటూ మృతదేహాన్ని చుట్టుముట్టారు పంచాయతీ కార్యదర్శులు. బాధ్యులైన ప్రజాప్రతినిధులపై కేసు నమోదు చేసి వెంకటేష్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో వెంకటేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంకటేష్ ఇంటికి చేరుకున్న ఆర్డీవో కొమరయ్య, పోలీసులు ..వెంకటేశ్ కుటుంబ సభ్యులు, ఆదివాసీ సంఘాల నేతలు, కార్యదర్శులతో చర్చించారు.  పై అధికారులను సంప్రదించి తగు న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

 

ఇవి కూడా చదవండి..

సీఎం అభ్యర్థిగా చన్నీ ఓకే అన్న సిద్ధూ

ప్రభుత్వ స్కూళ్లల్లో కనీస సౌకర్యాలు లేవు... ఆకునూరి మురళి