ప్రభుత్వ స్కూళ్లల్లో కనీస సౌకర్యాలు లేవు... ఆకునూరి మురళి

ప్రభుత్వ స్కూళ్లల్లో కనీస సౌకర్యాలు లేవు... ఆకునూరి మురళి
  • విద్యకు బడ్జెట్ లో తగిన ప్రధాన్యత లేదు

కేసీఆర్ తన ఏడున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను నాశనం చేశారని, వాటిలో కనీస సౌకర్యాలు కూడా లేవని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విమర్శించారు. 'పల్లె నిద్ర' కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని దరియా పూర్, అడవి శ్రీరాంపూర్ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలను ఆకునూరి మురళి సందర్శించారు. తరగతి గదుల స్థితి గతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో టాయిలెట్స్ కూడా సరిగా లేవన్నారు. రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి 28 వేల ప్రభుత్వ స్కూళ్ళను పట్టించుకోవడం కష్టంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభత్వ పాఠశాలను బాగు చేయాలన్నారు. అడవిశ్రీరాంపూర్  గ్రామంలోని ఎస్సీ కాలనిని సందర్శించిన మురళి వారితో పలు విషయాలపై చర్చించారు.