మాజీ ఎంపీ బుట్టా రేణుకకు షాక్.. ఆ స్కూల్ బిల్డింగ్ సహా ఆస్తుల వేలం..!

మాజీ ఎంపీ బుట్టా రేణుకకు షాక్.. ఆ స్కూల్ బిల్డింగ్ సహా ఆస్తుల వేలం..!

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు బిగ్ షాక్ తగిలింది.. రేణుక, ఆమె భర్త నీలకంఠంకు సంబంధించిన ఆస్తులు వేలం వేయనున్నట్లు ప్రకటించింది ఎల్ఐసీ హోసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. 2018లో రేణుక తీసుకున్నరూ.340 కోట్లు రుణం చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది సంస్థ. రూ. 340 కోట్ల రుణం కాస్త రూ.782.07 కోట్ల వరకు పెరిగిందని.. ఈక్రమంలో బుట్టా దంపతుల ఆస్తుల వేలం వేయాలని నిర్ణయించినట్లు తెలిపింది ఎల్ఐసీ హోసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.

హైదరాబాద్ లోని కేపీహెచ్బీ కాలనీలో సర్వే నంబర్ 1009, కేపీహెచ్బీ ఫేజ్ 6లో ఉన్న 3 వేల 833.28 చదరపు గజాల స్థలం వేలం వేయనున్నట్లు ప్రకటించింది ఎల్ఐసీ హోసింగ్ ఫైనాన్స్ లిలిమిటెడ్.అయితే ఈ వేలం ప్రకటనలో బుట్టా రేణుకకు చెందిన మెరిడియన్‌ స్కూల్ భవనం కూడా ఉండటం గమనార్హం. వేలానికి ప్రకటించిన మొత్తం ఆస్తి విలువ రూ.65 కోట్లు ఉన్నట్లు తెలిపింది ఎల్ఐసీ.

2018లో బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠం కలిసి రూ. 310 కోట్లు లోన్ తీసుకుకున్నారని... 15ఏళ్ళలో చెల్లించాల్సిన ఈ లోన్ ను బుట్టా పేరుతో ఉన్న మూడు సంస్థలకు వాడుకున్నారని తెలిపింది ఎల్ఐసీ. బుట్టా దంపతులు రూ.40 కోట్ల వరకు లోన్ తిరిగి చెల్లించారని..అసలు వడ్డీ కలిపి రూ. 340 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది ఎల్ఐసీ. 

వడ్డీ భారం పెరిగిన క్రమంలో బుట్టా దంపతులు ఆస్తులను అమ్మేసి లోన్ రీషెడ్యూల్ చేయాలని కోరినట్లు తెలిపింది ఎల్ఐసీ. అయితే, తాము ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని..బుట్టా దంపతుల ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించినట్లు తెలిపింది ఎల్ఐసీ.