సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఓయూలో నిరసన

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఓయూలో  నిరసన
  • సీఎం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ  ఓయూ జేఏసీ, దళిత విద్యార్థి సంఘం ,ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆయా సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేత దుర్గం భాస్కర్ మాట్లాడుతూ..భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా సీఎం అయిన కేసీఆర్ రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేయటం బాధాకరమన్నారు. పదిరోజుల్లో కేసీఆర్ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న రాష్ట్ర వ్యాప్తంగా  అంబేద్కర్ విగ్రహాల వద్ద ఆయన దిష్టి బొమ్మలు దహనం చేస్తామని హెచ్చరించారు. అదే రోజున రాజ్యాంగ పరిరక్షణ కోసం చలో హైదరాబాద్, చలో ఓయూకు పిలుపునిస్తామన్నారు.  అందులో భాగంగా రాష్ట్రలోని దళిత బహుజన, మైనారిటీ ప్రజలను హైదరాబాద్కు తరలించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. 

ఇవి కూడా చదవండి..

గిట్టుబాటు ధర కోసం రైతుల ధర్నా

నాపై కాల్పులు చేసినోళ్లలో ఒకడిని పట్టుకున్నం