
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమాపై మిక్స్డ్ టాక్ రావడంతో థియేటర్లలో ఈ సినిమా బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ‘మహావతార్ నరసింహ’ సినిమాకు వచ్చిన వన్ సైడ్ పాజిటివ్ టాక్ కూడా ‘కింగ్డమ్’ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది. ఇప్పుడు ‘కింగ్డమ్’ సినిమాకు మరో చిక్కొచ్చి పడింది. తమిళనాడు ఈ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించాలని ఆందోళనలు, నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి. ‘కింగ్డమ్’ సినిమాలో ఈలం తమిళులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, ఈ సినిమా శ్రీలంక తమిళుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని నిరసనకారుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.
తమిళనాడులోని రామనాథపురంలో ‘కింగ్డమ్’ సినిమా ప్రదర్శితమవుతున్న జగన్ థియేటర్ దగ్గర ఆందోళనకారులు నిరసనకు దిగారు. ‘కింగ్డమ్’ సినిమా బ్యానర్లను తొలగించారు. నామ్ తమిళర్ కచ్చి (NTK) చీఫ్ కోఆర్డినేటర్ సీమన్ తమిళనాడు వ్యాప్తంగా ‘కింగ్డమ్’ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో తమిళుల చరిత్రను వక్రీకరిస్తే చూస్తూ ఊరుకోమని సీమన్ హెచ్చరించారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. నాని ‘జెర్సీ’ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ‘కింగ్డమ్’ సినిమా జులై31న విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది.
శ్రీలంక నేర సామ్రాజ్యంలో కీలకవ్యక్తి అయిన తన అన్నను వెనక్కు తీసుకురావడం కోసం స్పై ఏజెంట్‌గా మారిన ఒక సాధారణ కానిస్టేబుల్.. ఆ నేర సామ్రాజ్యానికి కింగ్ ఎలా అయ్యాడు అనేది ప్రధాన కథ. సినిమా ఫస్ట్ సీన్ నుంచే డైరెక్ట్‌గా కథలోకి వెళ్లిన దర్శకుడు ఫస్ట్ హాఫ్‌ను బాగా హ్యాండిల్ చేశాడు. రెగ్యులర్ సినిమాకు భిన్నంగా ఏదో చూడబోతున్నాం అనే ఫీల్‌ను ఫస్ట్ హాఫ్ కలిగిస్తుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తనపై ఆఫీసర్‌ను కొడితే ఏం జరుగుతుందని ముందుగానే లెక్కలు వేసుకున్న ఓ సాధారణ కానిస్టేబుల్.. స్పై ఏజెంట్‌గా మారాక తన చుట్టూ జరుగుతున్న వ్యూహాన్ని పసిగట్టలేకపోవడం మేజర్ డ్రాబ్యాక్. ఓవరాల్ గా ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ బాలేదనే టాక్తో ‘కింగ్డమ్’ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతుంది.
#Kingdom banners have been torn as it portrays Eelam Tamils in a Evil way! pic.twitter.com/6wn5UToyRK
— Troll Cinema ( TC ) (@Troll_Cinema) August 5, 2025