శివరాత్రికి ఓరుగల్లు రావడం గర్వంగా ఉంది: గవర్నర్​

శివరాత్రికి ఓరుగల్లు రావడం గర్వంగా ఉంది:  గవర్నర్​

హనుమకొండ, వెలుగు: ‘‘ఇతరులకు మేలు చేస్తే.. శివుడే మనకు మేలు చేస్తడు. మనం సంతోషంగా ఉందాం.. అందరినీ సంతోషపరుద్దాం అనేదే మన తారక మంత్రం కావాలి’’ అని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇం డస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్​లో శనివారం సాయంత్రం నిర్వహించిన మహాశివరాత్రి ఆధ్యా త్మిక, సాంస్కృతిక సమ్మేళనానికి ఆమె చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించి తెలుగులో మాట్లాడి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ‘నేను శివుడి అనుగ్రహాన్ని అనుభవిస్తున్న. 3,800 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి రావడమే అందుకు ఉదాహరణ. ఉదయం జార్ఖండ్ గవర్నర్​ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు రాంచీ వెళ్లాను. అంతదూరం నుంచి ఈ వేడుకలకు రాలేనని కొందరు అన్నరు. కానీ ఆ శివుడే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు” అని ఆమె అన్నారు.

‘‘కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని సందర్శించి హైదరాబాద్ తిరిగి వస్తున్న సమ యంలో ఫ్లైట్​లో ఒకరికి గుండెనొప్పి రావడంతో నేనే కాపాడాను. ఆ కాశీ విశ్వనాథుడే ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇచ్చాడు” అని ఆమె చెప్పారు. ఓరుగుల్లుకు శివరాత్రి ఉత్సవాలకు రావడం గర్వంగా ఉందని తెలిపారు. బీజేపీ తమిళనాడు కో ఇన్​చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణలో గవర్నర్​కు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి సేవలు ఇలాగే కొనసాగించాలని కోరారు. తర్వాత సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారికి తమిళిసై పురస్కారాలు అందజేశారు.