సిద్దిపేట హోటల్ లో నాణ్యమైన ఫుడ్ అందించాలి : హరీష్

సిద్దిపేట హోటల్ లో నాణ్యమైన ఫుడ్ అందించాలి : హరీష్

హోటల్స్, దాబా, బేకరీ, రెస్టారెంట్స్ వ్యాపారస్టూలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు. గురువారం సిద్దిపేటలో మాట్లాడిన ఆయన..ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. సిద్దిపేటకు  వివిధ జిల్లాల నుండి వస్తూవుంటారని వారికి శుభ్రమైన ఆహారాన్ని ఇవ్వాలని సూచించారు. కొన్ని హోటళ్ల ముందు, బేకరీ వద్ద చెత్త చెదారం ఉంటుందని.. అలాంటి వారు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

వ్యాపారస్తులకు శిక్షణతో పాటు, సర్టిఫికెట్ ఇస్తామని..అయినా మారకపోతే.. వారికి జరిమానాలు విధిస్తామన్నారు. కల్తీ పదార్థాలు, కల్తీ నూనె వాడటంతో క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని..ప్లాస్టిక్ కవర్ లను త్వరలో బ్యాన్ చేస్తామన్నారు. మున్సిపల్ నుండి ఫుడ్ సర్టిఫికెట్ లు ఇస్తామని.. వాటిని చూసి ప్రజలు తింటారని తెలిపారు హరీష్.