
న్యూఢిల్లీ: సివిల్స్ ప్రిలిమ్స్ ముగిసిన వెంటనే ఇకనుంచి ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్ణయించింది. పరీక్షల పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రస్తుతం అన్ని పరీక్షల ప్రక్రియ పూర్తయ్యే వరకు యూపీఎస్సీ ఎలాంటి కీ విడుదల చేయడంలేదు. అన్ని పరీక్షలు ముగిశాకే ఫైనల్ కీని రిలీజ్చేస్తున్నది. దీన్ని సవాలు చేస్తూ కొందరు క్యాండిడేట్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనికి ప్రతిస్పందనగా సుప్రీంకోర్టు ముందు యూపీఎస్సీ కౌంటర్అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రిలిమ్స్ముగిసిన వెంటనే తాత్కాలిక కీ విడుదల చేసి.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది.