సహస్ర హత్య కేసులో మైనర్ నిందితుడికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్

సహస్ర హత్య కేసులో మైనర్ నిందితుడికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలో సంచలనం సృష్టించిన బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడైన బాలుడిని పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. కోర్టు ఆదేశాలతో రెండ్రోజులుగా జువెనైల్ హోమ్​లోనే బాలుడిని విచారిస్తున్నారు. 

సహస్ర తమ్ముడి వద్ద ఉన్న క్రికెట్​బ్యాట్​చోరీ కోసం వెళ్లి అడ్డు వచ్చిందనే కారణంతోనే ఆమెను హత్య చేసినట్టు నిందితుడు మరోసారి అంగీకరించినట్లు తెలిసింది. 

ఇప్పటికే బాలుడిపై హత్య, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు.. మరోసారి విచారించి హత్యకు దారితీసిన కారణాలను నిర్ధారించుకున్నారు. నిందితుడి మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని, అతనికి సైకియాట్రిక్​ట్రీట్మెంట్ 
ఇప్పిస్తున్నారు.