
పెట్స్ ఉండే ఇల్లు ఎంతో సందడిగా ఉంటుంది. బయటి పనులతో ఎంత ఒత్తిడికి గురైనా ఇంటికి చేరుకోగానే పెట్స్‌తో కాసేపు గడిపితే చాలు స్ట్రెస్ అంతా దూరం అవుతుంది. ఇంట్లో ఒకటి రెండు పెట్స్‌ను చూస్తేనే అంత ఆనందం కలిగితే... పదుల సంఖ్యలో కనిపించిన పెట్స్‌తో పెట్ లవర్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.
డాగ్ అండ్ క్యాట్ షో
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌లో గోపప్పి పెట్ కేర్ సొలూషన్స్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన డాగ్ అండ్ క్యాట్ షో ఆకట్టుకుంది. ఈ షోకు సిటీకి చెందిన పెట్ లవర్స్ పెద్ద ఎత్తున వచ్చారు. ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకున్న జంతు ప్రేమికులు.. తాము పెంచుకుంటున్న డాగ్స్, క్యాట్స్ తీసుకొచ్చి సందడి చేశారు. ఈ డాగ్ అండ్ క్యాట్ షోను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రారంభించారు. పెంపుడు జంతువుల ద్వారా ఒత్తిడి దూరం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా పెట్స్‌తో అందరూ ఎంజాయ్ చేస్తారని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు.
పెట్స్‌కు సర్వీసులు అందిస్తాం: సూర్యకళారెడ్డి
గో పప్పి సంస్థను ప్రారంభించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా డాగ్ అండ్ క్యాట్ షో ఏర్పాటు చేశామని ఆ సంస్థ నిర్వాహకురాలు సూర్యకళారెడ్డి తెలిపారు. పెట్స్‌కు సంబంధించిన అన్ని రకాల సర్వీసులు తాము అందిస్తున్నామని చెప్పారు. పెట్స్ పై అవగాహన కల్పించడానికి షోలు ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.
ర్యాంప్ వాక్
ఇదిలా ఉంటే.. ఈ షోకు వచ్చిన పెట్ లవర్స్ డాగ్స్, క్యాట్స్‌ను అందంగా ముస్తాబు చేసి తీసుకువచ్చారు. వాటితో ర్యాంప్ వాక్ చేశారు. షోలో పెంపుడు జంతువులకు ఉపయోగపడే సామాగ్రి, ఫుడ్‌కు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. తమ పెంపుడు జంతువులను ఇలాంటి షోలకు తీసుకుని రావడంతోపాటు ఇతర జాతులను చూడడం, వాటిని మచ్చిక చేసుకోవడం సరదాగా అనిపించిందని పెట్ లవర్స్ చెబుతున్నారు. కుక్కలు, పిల్లులే కాకుండా పక్షులు, సాలీళ్లు ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.