అనాథ గృహానికి రూ.2 లక్షల విరాళం

అనాథ గృహానికి రూ.2 లక్షల విరాళం

అనాథ గృహానికి రూ.2 లక్షల విరాళం

బర్త్ డే సందర్భంగా అందజేసిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు 

హైదరాబాద్, వెలుగు : ఎల్​బీనగర్‌‌‌‌‌‌‌‌లోని అనాథ విద్యార్థి గృహానికి పబ్లిక్ హెల్త్‌‌‌‌ డైరెక్టర్ శ్రీనివాసరావు రూ.2 లక్షలు విరాళం ఇచ్చారు. శుక్రవారం ఆయన బర్త్ డే  ఉండగా, గురువారం అనాథ విద్యార్థి గృహానికి వెళ్లి అక్కడి స్టూడెంట్లతో ఆయన మాట్లాడారు. స్టూడెంట్ల కోరిక మేరకు ఫ్రిజ్, కుక్కర్స్, మిక్సర్స్, స్టవ్, నెల రోజులకు సరిపడా బియ్యం, సరుకులు, స్కూల్ బ్యాగ్​లు, షూస్, ఇతర వస్తువులను కొనిచ్చారు. వీటి కోసం రూ.లక్ష ఖర్చు చేయగా,   మరో రూ.లక్ష క్యాష్​ను నిర్వాహకులకు అందజేశారు. వీటితో స్టూడెంట్స్‌‌‌‌కు టెక్ట్స్​ బుక్స్‌‌‌‌, స్టేషనరీ ఇతర వస్తువులు కొనివ్వాలని శ్రీనివాసరావు సూచించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ అనాథ విద్యార్థి గృహానికి భవిష్యత్‌‌‌‌లో కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా స్టాఫ్ లేకుండా, స్టూడెంట్లు తమకు తాముగా ఈ గృహాన్ని నడుపుకోవడం అభినందనీయమన్నారు. ఇక్కడ తమ పని తామే చేసుకుంటూ, చదువుల్లోనూ రాణిస్తున్న స్టూడెంట్లను ఆయన అభినందించారు. ఇక్కడి స్టూడెంట్లకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్న వసతి గృహ అధ్యక్షుడు రాజేశ్​ను ఆయన మెచ్చుకున్నారు. కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ శశిశ్రీ, డిప్యూటీ డైరెక్టర్ సోమశేఖర్, ఓఎస్డీ శంకర్‌‌‌‌‌‌‌‌, డాక్టర్ రవిశంకర్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.