డబుల్ బెడ్రూంలు అనర్హులకు ఇస్తున్నారని నిరసన

డబుల్ బెడ్రూంలు అనర్హులకు ఇస్తున్నారని నిరసన

డబుల్ బెడ్రూం ఇళ్లు  స్థానికేతరులకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు మంత్రి మల్లారెడ్డి మీటింగ్ లో నిరసన తెలిపారు. ఆగస్టు 2న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని అహ్మద్ గూడలో నిర్మించిన  డబుల్ ఇళ్లను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. 

సికింద్రాబాద్, ముషీరాబాద్ లకు చెందిన 1500 మంది లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందజేసిన అనంతరం మంత్రి మాట్లాడటం ప్రారంభించారు. అదే సమయంలో  అక్కడే ఉన్న స్థానికులు ఇళ్ల కేటాయింపులో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. 

స్థానికేతరులకు ఇళ్లు దక్కాయని తమకు న్యాయం చేసేవరకు పోరాటం ఆపబోయేది లేదని చెబుతూ మంత్రి ముందు నిరసనలకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిరసనకారులను కీసర పోలీస్ స్టేషన్ కి తరలించారు.