
యాదాద్రి: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు ప్రభుత్వ హైస్కూల్ శిథిలావస్థకు చేరింది. తరగతి గదుల గోడలకు పగుళ్లు వచ్చి.. స్లాబ్ పెచ్చులూడి స్టూడెంట్స్, టీచర్ల మీద పడుతోంది. దాంతో విద్యార్థులు, టీచర్లు గాయాలపాలవుతున్నారు. పాఠశాలలో నూతన గదులు నిర్మించాలని విద్యార్థులు, టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.