కూరగాయల ధరలు పెరగడంతో మిద్దె తోటలు పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు జనం. పట్టణాల్లో అనేకమంది తమకు అవసరమైన కూరగాయలు సొంతగా పండించుకుంటున్నారు. దీనివల్ల ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఆరోగ్యం బాగుంటుందంటున్నారు జనం.
నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొంత మంది తమ ఇంట్లోనే మిద్దెపైన పండ్లు కూరగయాల తోటలను పెంచుతున్నారు. కరోనా టైమ్ లో ఇంట్లోనే కురగాయలు,ఆకుకురలు పెంచే ట్రెండ్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు అది అలవాటుగా మారింది.ఎలాంటి రసాయనాలను వినియోగించకుండా సెంద్రీయ పద్దతిలో పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మిద్దెల పైన బెండకాయ, వంకాయ, చిక్కుడుకాయ, కీరదోస, ఆకుకూరల తో పాటు పండ్ల తోటలు కూడా పెంచుతున్నారు.
మిద్దెతోటల కోసం వాడె సేంద్రియ ఎరువులను ఇంట్లోనే తయారు చెసుకుంటున్నారు జనం. ఇంట్లోనే తడిచెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు. మిద్దెతోటకు అవసరమైన విత్తనాలను స్వయంగా ఉత్పత్తి చేసుకుంటున్నారు.ఇంట్లో వాడిన పండ్లు, కూరగాయల నుంచి విత్తనాలను వేరు చేసి వాడుకుంటున్నారు. కూరగాయల నుంచి విత్తనాలను వేరుచేసి ఎండబెట్టి మిద్దెతోటలోని కుండీల్లో విత్తుతున్నారు. తీగజాతి మొక్కల కోసం పందిళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.
స్వయంగా పెంచలేని, అరుదైన మొక్కలను నర్సీరీల నుంచి కొనుగోలు చేస్తున్నారు జనం. ఇంటిపై కుండీల్లో పలు రకాల కూరగాయలను పెంచుతూ సొంతానికి వాడుకోగా మిగిలినవాటిని స్నేహితులు, బంధువులకు ఇస్తున్నారు.వందల రుపాయలు పెట్టి కూరగాయలు కొన్నా వాటికి వాడే హానికర రసాయనాలు వాడడం వల్ల రోగాలొస్తున్నాయంటున్నారు జనం.మిద్దె తోటల్లో పండె కూరగాయలు ఆరోగ్యానికి మంచిదంటున్నారు. టౌన్ లలో ప్రతి ఇంటికి మిద్దె తొట ఉంటే ఆర్థికంగా ఆరోగ్య పరంగా బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
