
ఏపీలో అధికార టీడీపీకి దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఎన్నికల్లో సీటు రాని అసంతృప్తులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా పి.గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. పి.గన్నవరం టికెట్ ను ఈ సారి నెలపూడి స్టాలిన్ బాబుకు కేటాయించడంతో నిరాశ చెందిన పులపర్తి పార్టీని వీడారు. రేపో మాపో వైఎస్సార్సీపీలో చేరుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.