రాహుల్ గాంధీకి రాజయోగం..

రాహుల్ గాంధీకి రాజయోగం..
  • అధికార పార్టీ కొత్త చట్టాలు తెస్తుంది
  • సీఎం రేవంత్ సింహంలా పనిచేస్తుండు
  • చిలుకూరి శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం

హైదరాబాద్: కాంగ్రెస్​పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి త్వరలో రాజయోగం వస్తుందని పండితులు చిలుకూరి శ్రీనివాస మూర్తి అన్నారు. ప్రధానమంత్రి పదవిలో మార్పులు వస్తాయని తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా గాంధీ భవన్ లో పంచాంగ శ్రవణం వినిపించారు. ‘కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వస్తుంది. కలుషిత ఆహారం వల్ల ప్రజలు అనారోగ్య బారిన పెడ్తారు. పత్రికల్లో అబద్ధపు వార్తలు ఎక్కువ అవుతాయి. 

రాష్ట్రాల్లో ప్రతిపక్షం మరింత వీక్ అవుతుంది. అధికార పార్టీ కొత్త చట్టాలను తెస్తుంది. డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో అవకతవకలు, పేపర్ లీక్ లు జరుగుతాయి. మంత్రుల మరణాలు సంభవిస్తాయి. రాజకీయనేతలు కూడా శిక్షార్హులు అవుతారు. సుప్రీంకోర్టులో అనూహ్య మార్పులు సంభవిస్తాయి. కొందరు సీనియర్ నేతలు రాజకీయాలకు దూరమవుతారు. ఒక యోగి మన దేశాన్ని పాలిస్తాడు. ఆగస్ట్, సెప్టెంబర్ లో మతఘర్షణలు జరుగుతాయి. ఈడీ, సీబీఐ రాజకీయ నేతల కనుసన్నల్లోనే పనిచేస్తాయి.  సీఎం రేవంత్.. అక్టోబర్ నుంచి సింహంలాగా పనిచేశారు. క్రోధి నామసంవత్సరంలో కూడా మంచి జరుగుతుంది’ అని వివరించారు