కరోనాను జయించిన అక్క.. చిల్లర్ పార్టీ సాంగ్ స్టెప్స్ వేసి వెల్‌కం చెప్పిన చెల్లెలు: వీడియో వైరల్

కరోనాను జయించిన అక్క.. చిల్లర్ పార్టీ సాంగ్ స్టెప్స్ వేసి వెల్‌కం చెప్పిన చెల్లెలు: వీడియో వైరల్

కరోనా మహమ్మారిని జయించిన అక్క ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి రావడంతో తన చెల్లి పట్టరాని సంతోషంతో స్టెప్స్ వేస్తూ వెల్‌కమ్ చెప్పింది. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఆ యువతి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి హుషారుగా వేసిన స్టెప్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆమె పాజిటివిటీని మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఆ అమ్మాయికి తప్ప ఫ్యామిలీలో అందరికీ కరోనా

కరోనా నుంచి కోలుకుని ఇంటికి వస్తున్న అక్కకు ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో స్వాగతం చెప్పిన ఆ యువతి సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయింది. పుణేకు చెందిన 23 ఏళ్ల ఈ అమ్మాయి పేరు సలోనీ సత్పుత్. ఆమె తండ్రికి తొలుత కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత కుటుంబంలో మరో నలుగురికి కూడా కరోనా సోకిందని తేలడంతో అందరూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆ సమయంలో ఆ యువతి ఒక్కటే ఇంట్లో ఉండిపోయింది. అయితే సలోనీకి కూడా కరోనా టెస్టు చేయగా నెగటివ్ వచ్చినప్పటికీ ఒంటరిగా ఉన్న ఆమెకు సాయం చేసేందుకు ఇరుగు పొరుగు ముందుకు రాలేదు. ఆమెను సమాజ బహిష్కరణ చేసినట్లు ప్రవర్తించారు. అయినప్పటికీ మానసిక స్థైర్యం కోల్పోకుండా పాజిటివ్ దృక్పథంతో టైమ్ స్పెండ్ చేసింది. ముందుగా పేరెంట్స్ కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత సలోనీ అక్క ఇటీవలే కరోనాను జయించింది. ఆమె ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తున్న సమయంలో వీధి చివరలో ఉండగానే బాలీవుడ్ మూవీ ‘చిల్లర్ పార్టీ’లోని సాంగ్‌ పెట్టి హుషారుగా స్టెప్స్ వేస్తూ స్వాగతం చెప్పింది సలోనీ. ఆమె డాన్స్‌తో చుట్టుపక్కల వారికి కూడా ఒక సమాధానంలా కరోనా వస్తే అంతా అంటరానివారిని చూసినట్లు చూడక్కర్లేదని చెప్పింది. ఆమెతో పాటు తన అక్క కూడా డాన్స్ చేసింది. అనంతరం కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న కుమార్తెకు వారి తల్లి దిష్ఠి తీసి లోపలికి తీసుకెళ్లింది.

ఒరిజినల్ సాంగ్: