PBKSvsKKR: పంజా విసిరిన కింగ్స్..కోల్ కతాకు భారీ టార్గెట్

PBKSvsKKR: పంజా విసిరిన కింగ్స్..కోల్ కతాకు భారీ టార్గెట్

కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. 

ధనా ధన్ బ్యాటింగ్..

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్..ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 23 పరుగుల వద్ద ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఔటయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బానుక రాజపక్స రెచ్చిపోయాడు. కెప్టెన్ ధావన్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో 32 బంతుల్లో 5 ఫోర్లు,2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత బానుక రాజపక్స 109 పరుగుల వద్ద ఔటయ్యాడు.

  
టపా టపా..

బానుక రాజపక్స తర్వాత క్రీజులోకి వచ్చిన జితేష్ శర్మ మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లో రెండు సిక్సర్లు, ఫోర్ తో 21 పరుగులు చేశాడు. అయితే కీలక సమయంలో 135 పరుగుల వద్ద టీత్ సౌతీ బౌలింగ్ లో పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సికందర్ రజా ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 168 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 

చెలరేగిన కర్రన్..

చివర్లో వచ్చిన సామ్ కర్రన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 17 బంతుల్లో 26 పరుగులు పిండుకున్నాడు. ఇతనికి షారుక్ ఖాన్ 11 పరుగులతో సహకరించడంతో..పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. కోల్కతా బౌలర్లలో తీమ్ సౌతీ 2 వికెట్లు దక్కించుకోగా..ఉమేష్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.