
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ తదితరులు పాల్గొన్నారు.