బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా వీరు వులవల దర్శకత్వంలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. మే 22న సినిమా విడుదలవుతోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘అందర్నీ ఎంటర్‌టైన్ చేసే చిత్రమిది. వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల లాంటి సీనియర్స్‌తో వర్క్ చేయడంతో ఎంతో నేర్చుకున్నా. సప్తగిరి, కసిరెడ్డి నాకున్న భయాన్ని, బిడియాన్ని పోగొట్టారు. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా మా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు.
కార్యక్రమానికి హాజరైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరోయిన్ తేజస్వీ రావ్ ఈ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేసింది. దర్శకుడు వీరు వులవల మాట్లాడుతూ ‘బత్తుల పవన్ ఎక్కడా కొత్త హీరోలా కనిపించడు. కథ చెప్పిన వెంటనే సప్తగిరి చాలా ఎక్సయిట్ అయ్యారు. మగజాతి ఆణిముత్యంలా అందరినీ నవ్విస్తారు. రాజ్ కుమార్ కసిరెడ్డి కామెడీ టైమింగ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మా సినిమాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా’ అని చెప్పాడు.
ఇదొక ఫన్‌ఫిల్డ్ మూవీ అని, అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుందని నిర్మాతలు కోటేశ్వరరావు, సరస్వతి అన్నారు. హీరోయిన్స్ రాయంచ, విషిక, హాసిని సుధీర్, నటుడు సప్తగిరి, కెమెరామెన్ సతీష్ ముత్యాల, మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్, ఆర్ట్ డైరెక్టర్ రవి, ఎడిటర్ కోటి పాల్గొని ఈ సినిమా విజయం సాధించాలని కోరారు.
