
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘పుష్ప ది రూల్’. సోమవారం బన్నీ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ అమ్మవారి వేషంలో.. తలపై పెద్ద బొట్టు, ఒంటినిండా నగలు, కాలుకి గజ్జెలతో చీర కట్టుకుని, చేతిలో త్రిశూలంతో విలన్స్‌ను చితకబాదుతూ వీర మాస్ అవతార్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
గంగమ్మ జాతర సందర్భంలో వచ్చే ఈ సీన్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.