
పుష్ప ది రూల్ చిత్రం రానురానూ మెగా ఫ్యాన్స్, సినీ ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేస్తున్నది. అల్లు అర్జున్ సింహంతో సూపర్ ఫైట్ చేస్తాడని గతంలో రూమర్ వినిపించింది. ఇప్పుడు పుష్ప నుంచి మరో బజ్ వచ్చింది. అంతర్జాతీయస్థాయిలో రెడ్ సాండ్ స్మగ్లర్లతో డీల్ చేసేందుకు జపాన్ వెళ్లి వారి భాషలోనే మాట్లాడతాడని టాక్. పుష్ప ది రూల్ కు జపాన్ ఎపిసోడ్ సీన్స్ కొంత హైలెట్ అవుతాయని తెలుస్తున్నది. ఇటీవల వైజాగ్ షెడ్యూల్ ముగించుకొని, రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ను సుకుమార్ టీం మొదలుపెట్టింది.