ఒక్కొక్క మహిళ 8 మందిని కనాలె.. రష్యన్ మహిళలకు పుతిన్ పిలుపు

ఒక్కొక్క మహిళ 8 మందిని కనాలె.. రష్యన్ మహిళలకు పుతిన్ పిలుపు

మాస్కో :  రష్యా జనాభాను పెంచడం కోసం ఒక్కో మహిళ 8 మంది పిల్లలను కనాలని ఆ దేశ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. అంతకుమించి కంటే ఇంకా మంచిదని ఆయన చెప్పారు. మంగళవారం మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్​లో పుతిన్ మాట్లాడారు. పూర్వ కాలంలో ఒక్కో ఇంట్లో ఏడెనిమిది కంటే ఎక్కువ మంది సంతానం ఉండేదని, ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కాగా, 2023 జనవరి నాటికి రష్యా జనాభా 14 కోట్ల 64 లక్షలుగా ఉంది.

అయితే,1990 నుంచే ఆ దేశ జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా ఉక్రెయిన్​పై యుద్ధం మొదలు పెట్టినప్పటినుంచి రష్యన్ సోల్జర్లు 3 లక్షల మందికి పైగా చనిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దాంతో పాటు విదేశాలు పెట్టిన ఆంక్షల కారణంగా రష్యాలో పెద్ద మొత్తంలో కార్మికుల కొరత ఏర్పడింది. దీంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది.