
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తేలేదని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. యుద్ధం నుంచి పుతిన్ వెనక్కి తగ్గితే ఆయనను చంపేస్తారని మస్క్ తెలిపారు. రిపబ్లికన్లతో జరిగిన ఆన్ లైన్ చర్చలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో గెలవడం ఉక్రెయిన్‌కు అసాధ్యమని, ఇంకా కొనసాగించడం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. అమెరికా తాజాగా ప్రకటించిన ఆర్థిక సాయం వల్ల ఉక్రెయిన్‌కు ప్రయోజనం చేకూరదని వెల్లడించారు. యుద్ధంలో ఉక్రెయిన్ గెలవదన్నందుకు తాను ట్రోలింగ్‌కు గురయ్యానని, పుతిన్ పక్షపాతినని తనపై ముద్ర వేశారని చెప్పారు. అయితే, రష్యాను అణచివేయడానికి తమ కంపెనీలు గొప్పగా పనిచేస్తున్నాయని మస్క్ చెప్పారు.