ఎస్కార్ట్​ వెహికల్​ను అడ్డుకున్న అంబులెన్స్​

ఎస్కార్ట్​ వెహికల్​ను అడ్డుకున్న అంబులెన్స్​

బ్యాకప్​ కాన్వాయ్​తో పుతిన్​ను సేఫ్​ ప్లేస్​కు తరలించిన అధికారులు ​

మాస్కో: రష్యా ప్రెసిడెంట్​ పుతిన్ హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయానిస్తున్న కాన్వాయ్​లోని ఓ కారును అంబులెన్స్​ అడ్డుకుంది. అయినా భద్రతా బలగాలు కారును ఆపకుండా పుతిన్​ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాయని యూరో వీక్లీ న్యూస్ తెలిపింది. జీవీఆర్​ అనే టెలిగ్రామ్​ చానెల్​ ఈ ఘటనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్​ను రిలీజ్​ చేసింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం చెప్పలేదు. ‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్​ ఆఫీస్​ నుంచి ఇంటికి వెళ్తుండగా ముందున్న ఎస్కార్ట్ కారును ఓ అంబులెన్స్ అడ్డగించింది. ఈ ఆకస్మిక పరిణామంతో రెండో ఎస్కార్ట్ కారు కంట్రోల్ తప్పి చక్కర్లు కొట్టింది.

వెంటనే బ్యాకప్​ కాన్వాయ్​ సాయంతో పుతిన్​ను డెకాయ్​ మోటర్​కేడ్​లో ఆయన ఇంటికి తీసుకెళ్లారు’ అని టెలిగ్రామ్​ చానెల్​ తెలిపింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురు సెక్యూరిటీ ఆఫీసర్లను పోలీసులు విచారిస్తున్నారు. పుతిన్​కు ఎలాంటి గాయాలు కాలేదని, భద్రతా వైఫల్యంతోనే ఇలా జరిగిందని అధికారులు వివరించారు. పుతిన్ ఆరోగ్యం గురించి అంతర్జాతీయ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ టైంలో ఆయనపై హత్యాయత్నం జరగడం చర్చనీయాంశమైంది.