TTD ఛైర్మన్ పదవికి సుధాకర్ యాదవ్ రాజీనామా

TTD ఛైర్మన్ పదవికి సుధాకర్ యాదవ్ రాజీనామా

టీటీడీ ఛైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీటీడీ ఈవో సింఘాల్‌కు పంపారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో పాలక మండళ్లను రద్దు చేస్తామని తెలిపింది. ఈ సమయంలో కొన్ని దేవాలయాల పాలక మండళ్ల ఛైర్మన్లు, సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. టీటీడీ ఛైర్మన్ సుధాకర్ యాదవ్ మాత్రం ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే రాజీనామా చేస్తానని చెప్పారు.

అయితే ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఆర్డినెన్స్ తో టీటీడీ పాలకవర్గాన్ని తొలగిస్తామని ప్రకటించారు. ఆ ప్రకటన చేసి 24 గంటలు కూడా గడవక ముందే సుధాకర్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వం టీటీడీ కొత్త ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించనున్నట్టు  సమాచారం.