పదవి కోసం తండ్రి ఆశయాలను తుంగలోతొక్కారు

పదవి కోసం తండ్రి ఆశయాలను తుంగలోతొక్కారు
  • టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి

హైదరాబాద్: స్వర్గీయ పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ ప్రధాని పదవినిస్తే.. ఆయన కుమార్తె వాణిదేవి తండ్రిని ప్రధాని చేసిన పార్టీకి శత్రుపార్టీలో చేరారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఉప్ప‌ల్  అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాణిదేవి ఎమ్మెల్సీ ప‌ద‌వి కోసం తండ్రి ఆశ‌యాల‌ను తుంగ‌లో తొక్కారని.. పీవీ గౌర‌వం కాపాడుకోవాలంటే చిన్నారెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ పాల‌న‌లో ఎస్సీ,ఎస్టీ,బీసీ యువ‌త‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌పై టీఆర్ఎస్ కేంద్రాన్ని ఎందుకు  ప్ర‌శ్నించ‌డం లేదని ఆయన నిలదీశారు. మోడీ ఇవ్వ‌లేదు.. ఈ కేడీ అడ‌గ‌లేదు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని కాంట్రాక్ట‌ర్ల‌కు అప్ప‌గించి వంద‌ల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఢిల్లీలో మోడి ప‌త‌నం ప్రారంభమైంది.. అది గల్లీ వ‌ర‌కు వ‌స్తుందని ఆయన జోస్యం చెప్పారు. విభ‌జ‌న హామీల కోసం జంత‌ర్ మంత‌ర్‌లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్షకు నేను సిద్ధం..నీవు సిద్ద‌మా కేటీఆర్ అని ఆయన సవాల్ చేశారు. తండ్రీ కొడుకులు  క‌లిసి కుట్ర‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో: కీపింగ్‌లో రిషబ్ పంత్ మెరుపులు

డబుల్ ఇల్లు కోసం మున్సిపల్ వైస్ చైర్మన్ కాళ్లపై పడి వేడుకున్న ముసలవ్వ

రూ.200తో 50వేల టెస్టులు చేసేలా సీసీఎంబీ పరిశోధనలు

టీఆర్ఎస్, బీజేపీలను ఓడిస్తే.. ప్రభుత్వాలు దిగొచ్చి ధరలు తగ్గిస్తాయి