తెలంగాణ భవన్లో  పీవీ జయంతి వేడుకలు

తెలంగాణ భవన్లో  పీవీ జయంతి వేడుకలు

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. శనివారం భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో పీవీ చిత్ర పటానికి భవన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఆర్సీ) శశాంక్ గోయల్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టేందుకు పీవీ చేపట్టిన సంస్కరణలను స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో భవన్ అధికారులు, సిబ్బంది, పీవీ అభిమానులు పాల్గొన్నారు. 

హర్యానాలో గవర్నర్ దత్తాత్రేయ

హర్యానా రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన పీవీ నరసింహా రావు జయంతి వేడుకల్లో ఆ రాష్ట్ర గవర్నర్ దత్తాత్రేయ పీవీ చిత్ర పటానికి నివాళులర్పించారు. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న వేళ.. ప్రధానిగా పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని అభివృద్ధి వైపు నిలిపాయన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా దేశ అభ్యున్నతికే ఆయన అనునిత్యం కృషి చేశారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సీఎంగానూ పీవీ చేసిన సేవలు చిరస్మరణీయమని దత్తాత్రేయ పేర్కొన్నారు.