మలేషియా ఓపెన్ సూపర్-1000 టూర్ లో ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. అద్భుత పర్ఫామెన్స్ తో సెమీస్ లోకి దూసుకెళ్లిన పీవీ సింధు శనివారం (జనవరి 10) టోర్నీ నుంచి వైదొలగింది. చైనా షట్లర్ వాంగ్ ఝీ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి వెనుదిరిగింది.
వరల్డ్ 2వ ర్యాంకర్ అయిన చైనా షట్లర్ వాంగ్ ఝీ ఒత్తిడికి తట్టులేక రెండు వరుస సెట్లలో 16-21, 15-21 తేడాతో ఓడిపోయింది.
గాయం కారణంగా రెండు నెలలు దూరంగా ఉన్న సింధు.. కోలుకున్న తర్వాత ఆడుతున్న మొదటి టోర్నమెంట్ ఇది. చివరిగా సింధు 2025, అక్టోబర్ నెలలో ఆడింది.
హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్ లో 5-2 స్కోర్ తో మొదటి గేమ్ లో లీడ్ సాధించింది సింధు. ఆ తర్వాత వాంగ్ పుంజుకోవడంతో వెనకబడింది. వాంగ్ తప్పిదాలను అందిపుచ్చుకున్న సింధు.. 9-7 లీడ్ తో ముందుకు సాగినా.. తర్వాత వాంగ్ ఏ అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం సాధించింది.
ఇద్దరి స్కోర్లు 13-13 దగ్గర లాక్ అయినప్పుడు.. మ్యాచ్ రీస్టార్ట్ అయినప్పుడు ఇద్దరూ కాస్త స్ట్రగులయ్యారు. ఆ తర్వాత 15-14 నుంచి వాంగ్ సింధుపై ప్రెజర్ పెంచుతూ దూసుకెళ్లింది.
ఇక రెండో గేమ్ లో 1-3 స్కోర్ దగ్గర సింధు చేసిన రెండు మిస్టేక్స్ చేసినప్పటికీ.. మళ్లీ కోలుకుని 6-3 వరకు లీడ్ చూపించింది. ఆ తర్వాత వాంగ్ మళ్లీ మ్యాచ్ పై ఆధిపత్యం చూపిస్తూ సింధూపై ఘనవిజయం సాధించింది.
