Indonasia Open: భారత బ్యాడ్మింటన్ స్టార్, టూ-టైమ్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుకి మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో సింధు ప్రయాణం ఇక ముగిసింది. ప్రి-క్వార్టర్స్ (రౌండ్ ఆఫ్ 16) లో వరల్డ్ నంబర్ 1, సౌత్ కొరియా స్టార్ ప్లేయర్ అన్ సే యంగ్ చేతిలో సింధు వరుస సెట్లలో ఓడిపోయి టోర్నీ నుంచి ఔట్ అయింది. మొన్నటి సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లోనూ ఈ కొరియన్ చేతిలోనే ఓడిన సింధు.. కేవలం వారం రోజుల గ్యాప్‌లోనే మరోసారి ఓటమిని మూటగట్టుకుంది
అన్ సే యంగ్ని ఓడించడం ఇంపాజిబుల్లా?:
అన్ సే యంగ్‌తో తలపడటం అంటే సింధుకి ఒక పెద్ద టాస్క్‌లా మారిపోయింది. ఈ ఓటమితో అన్ సే యంగ్‌పై సింధు వరుసగా 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయినట్లయింది. హెడ్- టు హెడ్ రికార్డులో సింధు ఇప్పటి వరకు ఈ కొరియన్ స్టార్‌పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడం (10-0) ఇండియన్ బ్యాడ్మింటన్ ఫ్యాన్స్‌ని బాగా హర్ట్ చేస్తోంది.
ఫస్ట్ గేమ్‌లో ఫైట్ ఇచ్చినా.. తప్పని తిప్పలు:
మ్యాచ్ స్టార్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో కొనసాగింది. మొదటి గేమ్‌లో ఇద్దరూ పాయింట్ పాయింట్‌కి గట్టిగా పోటీ పడ్డారు. ఒక దశలో స్కోరు 10– 10తో టై అయింది. సింధు తన అగ్రెసివ్ షాట్లతో అన్ సే యంగ్‌ని కాస్త ప్రెజర్‌లో నెట్టి 15–14తో లీడ్‌లోకి కూడా దూసుకెళ్లింది. కానీ ఆ తర్వాత అన్ సే యంగ్ తన ట్రేడ్‌మార్క్ డిఫెన్స్‌తో పుంజుకుంది. వరుసగా పాయింట్లు కొడుతూ 19– 16కి చేరుకుంది. ఈ క్రమంలో జరిగిన ఒక సుదీర్ఘమైన 41 షాట్ల ర్యాలీ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆ పాయింట్‌ను కొరియన్ ప్లేయర్ గెలవడంతో ఫస్ట్ గేమ్ 17–21తో సింధు చేజార్చుకుంది.
సెకండ్ గేమ్‌లో వన్-సైడ్ షో!:
* మొదటి గేమ్ గెలిచిన జోష్‌లో అన్ సే యంగ్ సెకండ్ గేమ్‌లో పూర్తిగా డామినేట్ చేసింది. కోర్టు నలుమూలలా ఈజీగా మూవ్ అవుతూ సింధుని ఊపిరి ఆడనివ్వలేదు.. చూస్తూనే స్కోరును 13–6కి తీసుకెళ్లి గేమ్ లాక్ చేసింది.
* సింధు ఒంటరి పోరాటం: అంత పెద్ద డిఫరెన్స్ ఉన్నా సింధు గట్టిగానే ఫైట్ చేసింది. తన పవర్‌ఫుల్ స్మాష్‌లతో గ్యాప్‌ని తగ్గించడానికి ట్రై చేసింది కానీ.. అన్ సే యంగ్ కోర్టు కవరేజ్, కన్సిస్టెన్సీ ముందు సింధు ప్లాన్స్ వర్కవుట్ అవ్వలేదు.. చివరకు రెండో గేమ్‌ను కూడా 14–21తో కోల్పోయి మ్యాచ్‌ను వదిలేసుకుంది.
* పీవీ సింధు ఆటలో అక్కడక్కడా మెరుపులు కనిపించినప్పటికీ.. వరల్డ్ నంబర్ 1 అన్ సే యంగ్ ప్లానింగ్, ఫిట్‌నెస్ ముందు అవి సరిపోలేదు. ఒలింపిక్ ఛాంపియన్ అన్ సే యంగ్ క్వార్టర్ ఫైనల్స్‌కి దూసుకెళ్లగా.. సింధు మాత్రం మరోసారి 'కొరియన్ డిఫెన్స్' ను బ్రేక్ చేయలేక టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
Indonesia Open (Super 1000) Update: END of Indian Singles challenge in the 2nd round itself!
— India_AllSports (@India_AllSports) June 4, 2026
PV Sindhu ❌
Ayush Shetty ❌
Lakshya Sen ❌
HS Prannoy ❌
Kidambi Srikanth ❌
Malvika Bansod ❌
Unnati Hooda ❌ #IndonesiaOpen2026 https://t.co/52tgApqZxu
