V6 News

ఒలింపిక్‌ మెడలే టార్గెట్‌ అంటున్న సింధు

ఒలింపిక్‌ మెడలే టార్గెట్‌ అంటున్న సింధు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌‌లో మెడల్‌‌ సాధించడమే లక్ష్యంగా ట్రెయినింగ్‌‌లో శ్రమిస్తున్నానని ఇండియా బ్యాడ్మింటన్‌‌ స్టార్‌‌ పీవీ సింధు చెప్పింది. న్యూట్రిషన్‌‌ ట్రెయినింగ్‌‌ కోసం ప్రస్తుతం ఇంగ్లండ్‌‌లో ఉన్న సింధు.. థాయ్‌‌లాండ్‌‌లో ఈ నెలలో జరగబోయే టోర్నీలతో కాంపిటీటివ్‌‌ బ్యాడ్మింటన్‌‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. ‘నా ట్రెయినింగ్‌‌ బాగా జరుగుతోంది. థాయ్‌‌లాండ్‌‌ టోర్నీల కోసం వెయిట్‌‌ చేస్తున్నా.  ట్రెయినింగ్‌‌కు కావాల్సినంత టైమ్‌‌ దొరికింది. అందువల్ల నా బెస్ట్‌‌ ఇస్తానని నమ్మకంగా ఉన్నా. ఒలింపిక్స్‌‌ కోసం ప్లాన్స్‌‌ సిద్ధం చేసుకున్నా. ఎందుకంటే ఆ మెడల్‌‌ కోసం ప్రతీ ప్లేయర్‌‌ వంద శాతం కష్టపడతారు. టోక్యోలో మెడల్‌‌ సాధించాలని నేను కూడా కోరుకుంటున్నా. దాని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా.  ఒలింపిక్స్‌‌లో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ నేను నా బెస్ట్‌‌ ఇస్తా’ అని సింధు చెప్పుకొచ్చింది. టోర్నీలు రీస్టార్ట్‌‌ అవుతున్నప్పటికీ కరోనా ముప్పు ఇంకా ఉండటంతో ప్లేయర్లంతా అప్రమత్తంగానే ఉండాలని వరల్డ్‌‌ చాంపియన్‌‌ సింధు పేర్కొంది. ‘కరోనా దెబ్బకు విధించిన లాక్‌‌డౌన్‌‌ వల్ల స్టార్టింగ్‌‌లో అన్నీ మూతపడ్డాయి. ప్రాక్టీస్‌‌కు కూడా చాన్స్‌‌ లేకుండా పోయింది.  ఇప్పుడు అన్నీ మొదలయ్యాకా అంతా బాగానే ఉంది. కానీ ప్రోటోకాల్స్‌‌ పాటిస్తూ జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. నా వరకు మాత్రం లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌ అంతా బాగా గడిచింది. చాన్నాళ్ల తర్వాత బ్రేక్‌‌ దొరకడంతో ఇంట్లోనే ఆనందంగా ఉన్నా. నెమ్మదిగా ట్రెయినింగ్‌‌ కూడా స్టార్ట్‌‌ చేశా  ఇప్పుడు టోర్నీలు రీస్టార్ట్‌‌ అయినా ఫ్యాన్స్‌‌ ఉండరు ’ అని సింధు చెప్పింది.