PVR Passport: ఇకనుండి నో టికెట్స్.. నెలకు నాలుగు సినిమాలు.. కండిషన్స్ అప్లై

PVR Passport: ఇకనుండి నో టికెట్స్.. నెలకు నాలుగు సినిమాలు.. కండిషన్స్ అప్లై

ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచాన్ని యేలేస్తోంది పీవీఆర్. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలను శాశించే స్థాయికి చేరుకుంటోంది. అదే లెవల్లో ఆడియన్స్ ను ఎక్స్ పీరియన్స్ ను కూడా అందిస్తోంది. ఆడియో, వీడియో లలో సరికొత్త క్వాలిటీస్ లను ప్రేక్షకులకు అందిస్తూ అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ను అందిస్తోంది. అందుకే పీవీఆర్ లో సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. 

ఇక తాజాగా ఆడియన్స్ కోసం సరికొత్త పాలసీని తీసుకురానుంది పీవీఆర్. అదేంటంటే.. ఇక నుండి టికెట్స్ కాకుండా మంత్లీ అండ్ ఇయర్లీ పాస్పోర్ట్ లను ఇవ్వనుంది. ఈ పాస్పోర్ట్ తీసుకున్నవారికి నెలకు నాలుగు సినిమాలు ఫ్రీగా చూసే అవకాశాన్ని కలిపిస్తోంది. అంతేకాదు.. ఏ పాసుపోర్టు లను కూడా వివిధ రకాలుగా విక్రయించనున్నారు. వాటిలో.. పాస్‌పోర్ట్ 1 ఒకటి. దీని ఖరీదు రూ.349. ఇది ముప్పై రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.. నాలుగు సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. ఇక పాస్‌పోర్ట్ 2 విలువ రూ.1047. ఇది 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా.. 12 సినిమాలు చూడొచ్చు.

అయితే ఈ పాస్‌పోర్ట్ తీసుకునే వారు కొని కండీషన్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే.. పీవీఆర్ పాస్‌పోర్ట్ తో కేవలం సోమవారం నుండి గురువారం మాత్రమే సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. వీకెండ్స్ లో సినిమాలు చూసే అవకాశం లేదు. ఎందుకంటే.. ఈ మూడురోజుల్లో కొత్త కొత్త సినిమాళు విడదల అవుతున్నాయి. కాబట్టి... ఈ మూడురోజుల్లో సినిమాలు పాస్‌పోర్ట్ పై సినిమాలు చూసే అవకాశం లేదు. ఇక ఈ సిస్టం హైదరాబాద్ వంటి సిటీలని ఇప్పటికే అందుబాటులో ఉండగా.. తెలంగాణలోని మిగతా సిటీలలో కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.